Share News

ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:20 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే పాల్వయి హరీష్‌ అన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి
హాలియాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌

డిండి, దేవరకొండ, కొండమల్లేపల్లి, హాలియా, ఫిబ్రవరి 28: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే పాల్వయి హరీష్‌ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి, దేవరకొండ, కొండమల్లేపల్లి, హాలియాలలో బుధవారం సాగిన విజయ సంకల్పయాత్రలో ఆయన మాట్లాడారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కాశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేసిన ఘనత నరేంద్రమోదిదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు ఇప్పటికి రైతులకు రైతుబంధు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రూ.500కే సిలిండర్‌ అన్న సీఎం రేవంత్‌రెడ్డి మొత్తం సిలిండర్‌ డబ్బులు చెల్లించాలని చెబుతున్నారని తెలిపారు. మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో ఎలా అధికారం చేపడుతుందని ఎద్దేవా చేశారు. హిందువుల రామ మం దిర నిర్మాణం 500 సంవత్సరాల కల నరేంద్రమోదీ నాయకత్వంలో సహకారమైందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి ప్రాజెక్టులను కాంగ్రెస్‌, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తిచేయాలని, దేవరకొండ ఖిల్లాతోపాటు దేవరచర్లను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. సాగర్‌లో కనిపిస్తున్న జాతీయ రహదారులు, వెలుగుతున్న లైట్లు, ఐదు కేజీల బియ్యం, ఉపాధి హమీ పనులు, సిమెంట్‌ రోడ్లు కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుంభకోణాల పార్టీ కాంగ్రె్‌సకు ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. కేం ద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, నూకం నర్సింహారెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోంద న్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వేమార్గాలు మంజూరు చేసిందన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు వర్షిత్‌రెడ్డి, ఏటి కృష్ణ, లాలునాయక్‌, వానం నరేందర్‌రెడ్డి, బండారు ప్రసాద్‌, రాధిక, మౌ నిక, నూకం నర్సింహరెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌గాంధీ, మన్మద్‌రెడ్డి, కేతావత్‌ లాలునాయక్‌, డాక్టర్‌ కళ్యాణ్‌నాయక్‌, నక్క వెంకటే్‌షయాదవ్‌, నివేదితరెడ్డి, గార్లపాటి జితేందర్‌, నారోజుపద్మ, నేతాళ్ల వెంకటేష్‌, బండారు ప్రసాద్‌, కంకణాల శ్రీధర్‌రెడ్డి, గుండాల వెంకటే్‌షయాదవ్‌, ఏటి కృష్ణ, జల్ధా భాస్కర్‌, కొంపల్లి శ్రీనివాస్‌యాదవ్‌, మన్నెం రంజిత్‌యాదవ్‌, చెన్ను వెంకట్‌నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, నారాయణరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, ఉయ్యాల నర్సింహాగౌడ్‌, జానకిరామయ్య, బొడిగ సాంబశివగౌడ్‌, పేర్ల జితేందర్‌, కుంభం యాదగిరి, పాక నగేశ్‌, భూతరాజు భరత్‌ ఉన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:20 AM