Share News

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:47 AM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. పార్టీ జహీరాబాద్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌,

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక

ఆందోల్‌లో బహిరంగ సభ

1, 5 తేదీల్లో రాష్ట్రంలో షా ప్రచారం

హైదరాబాద్‌, సంగారెడ్డి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. పార్టీ జహీరాబాద్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌, మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోల్‌ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్‌ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్‌-మెదక్‌ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. తిరిగి ప్రధాని మే 8న కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలోనే నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీకి అందింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మే 1వ తేదీన హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గౌలిపురాలో నిర్వహించే రోడ్డు షోలో అమిత్‌ షా పాల్గొంటారు. తిరిగి 5వ తేదీన నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 04:47 AM