Share News

18న ప్రతిభ పురస్కారాల ప్రదానం

ABN , Publish Date - May 15 , 2024 | 11:53 PM

ప్రభు త్వ పాఠశాలల్లో మెరుగైన ఫ లితాలు రాబట్టిన ప్రధానోపా ధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్లు గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థ వైస్‌ చైర్మన యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

 18న ప్రతిభ పురస్కారాల ప్రదానం
డీఈవోను సన్మానిస్తున్న గ్లోబల్‌ ప్యామిలీ వైస్‌ చైర్మన ప్రభాకర్‌రెడ్డి

18న ప్రతిభ పురస్కారాల ప్రదానం

నల్లగొండ, మే 15: ప్రభు త్వ పాఠశాలల్లో మెరుగైన ఫ లితాలు రాబట్టిన ప్రధానోపా ధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్లు గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థ వైస్‌ చైర్మన యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం డీఈవో బొల్లారం బిక్షపతిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ మండలంలోని 27 ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో 79 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. వారికి విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రధానోపాధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల కాళోజీ ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నల్లగొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు కృషి చేసిన హెచఎంలకు అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఈవో, డైట్‌ ప్రిన్సిపాల్‌ నర్సింహ, డీసీఈబీ సెక్రటరీ కొమ్ము శ్రీనివాస్‌, నల్లగొండ ఎంఈవో కొమ్ము అరుంధతి, గాంధీ గ్లోబల్‌ ప్యామిలీ ఛీప్‌ అడ్వైజర్‌ గోనారెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 11:53 PM