ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - May 12 , 2024 | 12:17 AM
ఈ నెల 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు
ఎస్పీ చందన దీప్తి
నల్లగొండ, మే 11: ఈ నెల 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తన పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 84 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 3 వేల మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏడు కంపెనీల కేంద్ర బలగాలను ఏర్పాటు చేశామని, వీటితో పాటు ఐదు ప్లాటున్ల టీఎ్‌సఎస్పీ సిబ్బంది, పెట్రోలింగ్ పార్టీలు, క్విక్ రియాక్షన టీంలు, స్ర్టైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ర్టైకింగ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 313 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర పారా మిలటరీ బలగాల ద్వారా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగరాదన్నారు.