Share News

Manchiryāla- ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:31 PM

లోక్‌సభ పెద్దపల్లి సెగ్మెంట్‌ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోస్టుమార్టం ప్రారంభించాయి. ఓటింగ్‌కు ముందు రోజు వరకు తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేసిన ఆయా పార్టీల అభ్యర్థులకు ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. ముఖ్యంగా బీజేపీలో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది.

Manchiryāla-      ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం
లోగో

- ప్రణాళికలు బెడిసికొట్టడమే కారణం

- మూడో స్థానంలో నిలువడంపై బీఆర్‌ఎస్‌ అంతర్మథనం

- మంచిర్యాలలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ

మంచిర్యాల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ పెద్దపల్లి సెగ్మెంట్‌ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోస్టుమార్టం ప్రారంభించాయి. ఓటింగ్‌కు ముందు రోజు వరకు తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేసిన ఆయా పార్టీల అభ్యర్థులకు ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. ముఖ్యంగా బీజేపీలో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే మొన్నటి పార్లమెంట్‌ ఎలక్షన్లలోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమి పాలు కావడం జిల్లాలో చర్చనీయాంశం అయింది. అసలు లోపం ఎక్కడుందో అన్వేషించే పనిలో పడ్డారు.

ప్రత్యేక ప్రణాళికతో వెళ్లినా..

ఎన్నికల సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఎవరికి వారే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నారు. సీనియర్ల సలహాలు, సూచనలతో వ్యూహరచన చేశారు. తీరా ఫలితాలు వారి అంచ నాలకు విరుద్ధంగా రావడంతో పునరాలోచనలో పడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు నేరుగా ఓటర్లను కాకుండా ఆయా ప్రాంతాల్లోని వివిధ కమిటీలను నమ్ముకోవడంతో మొదటికే మోసం వచ్చినట్లయింది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా వివిధ సంఘాలపైనే అభ్యర్థులు పూర్తిగా ఆధా రపడ్డారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండడం ఇతర పార్టీల అభ్యర్థుల అంచనాలను తారుమారు చేసింది. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసే టికెట్‌ పొందడంపై చూపిన శ్రద్ధ ప్రచారంలో చూపకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారని చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ కోసం చాలా మంది ప్రయత్నించారు. కాగా అధిష్ఠానం గొమాసేకు టికెట్‌ కేటాయించింది. ఆయన నేతకాని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ పడతా యని పార్టీ అంచనా వేసింది. పార్టీ అంచనాలకు అనుగుణంగా గొమాసే ప్రచారంలో పాల్గొనకపోవడం నష్టాన్ని మిగిల్చింది. బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నా...ఓటమి చెంద డంపై ఆ పార్టీ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. కేవలం ప్రచారంలో వెనుకబడటమే బీజేపీ అభ్యర్థి ఓటమిపాలు కావడానికి కారణంగా భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తు న్నా ప్రచారంలో స్పీడు పెంచక పోవడంతో శ్రీనివాస్‌ గొమాసేపై పార్టీ ముఖ్యులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అయినా తన పద్ధతి మార్చు కోకపోవడంతో ఓటమి పాలయ్యారని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే..

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్‌ ఎలక్షన్‌లో కూడా బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ తరుపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బరిలో దిగినప్పటికీ ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. కొప్పుల ఈశ్వర్‌ తరుపున స్వయంగా మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఓటర్లు పెద్దగా స్పందిం చలేదు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌తోపాటు మాజీ ఎమ్మె ల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలు కొప్పుల ఈశ్వర్‌ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా చెన్నూరులో బహిరంగ సభ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Updated Date - Jun 05 , 2024 | 10:31 PM