Share News

Manchiryāla- నేడు పోలింగ్‌

ABN , Publish Date - May 12 , 2024 | 10:51 PM

జిల్లాలో సోమవా రం నిర్వహించే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానానికి సంబంఽ దించి మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 741 బూత్‌లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Manchiryāla-       నేడు పోలింగ్‌
చెన్నూరు డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది

- కేంద్రాలకు సామగ్రి తరలించిన సిబ్బంది

- పటిష్ట బందోబస్తు మధ్య పార్లమెంట్‌ ఎన్నికలు

- ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు

- స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన

- జిల్లాలో 6 లక్షల పై చిలుకు ఓటర్లు

మంచిర్యాల, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవా రం నిర్వహించే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానానికి సంబంఽ దించి మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 741 బూత్‌లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లకు తావులేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయగా, సరిహద్దు రాష్ట్రాల ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో డ్రోన్‌ పెట్రోలింగ్‌ యూనిట్‌ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, నియమ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆదివారం పరిశీలించారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలింగ్‌ బందోబస్తు, భద్రత కోసం 3300 మంది పోలీస్‌ బలగాలను ఏర్పాటు చేశారు. 832 సివిల్‌ ఫోర్స్‌, 384 వింగ్‌ ఫోర్స్‌, 300 మంది హోంగార్డ్స్‌, 300 మంది శిక్షణ కానిస్టేబుళ్లు, 700 మంది చత్తీష్‌గడ్‌ రాష్ట్రానికి చెం దిన హోం గార్డులు, 64 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బందితో పాటు ఎన్‌సీసీ కెడేట్లు, 443 మంది ఐదు కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

త్రిముఖ పోటీ..

పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తరుపున గడ్డం వంశీకృష్ణ, శ్రీనివాస్‌ గొమాసే, కొప్పుల ఈశ్వర్‌లు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యనే నెలకొంది. మూడు పార్టీల నుంచి హేమా హేమీలు తలపడుతుండడంతో ఓటర్ల మద్దతు ఎవరికి లభిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కుటుంబానికి పెద్ద రాజకీయ చరిత్రే ఉండగా, ప్రత్యక్ష ఎన్నికల బరిలో మొదటి సారి దిగుతున్న ఆయన తన రాజకీయ భవిష్యత్తును పరిక్షించుకోనున్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసేకు సీనియర్‌ నాయకుడిగా పేరుంది. 2009లో ఆయన కాంగ్రెస్‌ టికెట్‌పై పెద్దపల్లి పా ర్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాజకీయానుభవం మెండుగా ఉంది. గతంలో ఆయన పలుమార్లు మేడారం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు. కాగా ఓటర్ల మద్దతు పై ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికి ఉంటుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో..

పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 6 లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 6,49,905 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 105 మంది ఎన్‌ఆర్‌ఐలు, మరో 1462 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. కాగా చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గం లో 1,94,064 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 96,019 మంది ఉండగా, స్త్రీలు 97,752, ఇతరులు 7గురు ఉన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ ఓట్లు 8 ఉండగా మొత్తం పురుషులే ఉన్నారు. సర్వీసు ఓటర్లు 140 మంది ఉండగా పురుషులు 138 మంది, స్త్రీలు 2 ఉన్నారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో 1,76,688 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 87,283 మంది, స్త్రీలు 89,219, ఇతరులు 12 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ పురుషులు 2 ఉన్నారు. సర్వీసు ఓటర్లు 172 మందిలో పురుషులు 163, స్త్రీలు 9 మంది ఉన్నారు. మంచిర్యాల నియోజక వర్గంలో 2,79,153 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,38,064, స్త్రీలు 1,40,648 మంది, ఇతరులు 26 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 28 మంది ఉండగా, పురుషులు 22, స్త్రీలు 6గురు ఉన్నారు. సర్వీసు ఓటర్లలో 365 మందికిగాను పురుషులు 355, స్త్రీలు 10 మంది ఉన్నారు.

చెన్నూరు: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ఆదివారం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని డీసీపీ అశోక్‌కుమార్‌, చెన్నూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి చంద్రకళతో కలిసి ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని అందజేశారు. నియోజకవర్గంలో 227 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు గాను 272 పీవోలు, 272 మంది ఏపీవోలు, 544 ఓపీవోలు ఉండగా ,మొత్తంగా 28 రూట్‌ లను ఏర్పాటు చేయగా, 28 మంది జోనల్‌ అధికారులు, 30 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి చంద్రకళ తెలిపారు.

మందమర్రిటౌన్‌: మందమర్రి పట్టణంలో పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విదుల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించారు.

కాసిపేట: బెల్లంపల్లి నియోజకవర్గంలో ఐదు మహిళ పోలింగ్‌ కేంద్రాలు, మరో ఐదు మోడల్‌ పోలింగ్‌ కేంద్రా లను ఎంపిక చేశారు. వీటితో పాటు ఒకటి యూత్‌, మరొకటి దివ్యాంగుల కోసం పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అన్ని సౌకార్యలతో ముస్తాబు చేశారు. మహిళ పోలింగ్‌ కేంద్రాల్లో మహిళా సిబ్బందే విధులు నిర్వహిస్తారు.

వేమనపల్లి: మండలంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఆదివారం సాయంత్రం పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. సిబ్బందికి సెక్టార్‌ అధికారులు బాపురావు, గిరిధర్‌రెడ్డి, నరేష్‌లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

హాజీపూర్‌: మండలంలోని అన్ని గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు ఆదివారం సాయంత్రం పోలింగ్‌ అధికారులు ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. వీరికి పంచాయతీ సిబ్బంది,బీఎల్‌వోలు స్వాగతం పలికారు. ఎన్నికల ప్రి సైడింగ్‌ అధికారి శంకర్‌, ఎస్‌ఐ సురేష్‌, పంచాయతీ కార్య దర్శి ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: లోకసభ ఎన్నికలకు దండేపల్లి మండలంలో ఆయాగ్రా మాలోని ఆదివారం రాత్రి వరకు అంతా సిద్ధం చేసినట్లు దండేపల్లి తహసీల్దార్‌ సంధ్యరాణి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఎన్నికల అధికారులు, తమ సిబ్బందితో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

భీమారం: మండలంలో పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల వ్యాప్తంగా భీమారం, మద్దికల్‌, ఖాజీపల్లిలను మూడు సెక్టార్లుగా విభజించి ముగ్గురు సెక్టార్‌ అధికారులు, రూట్‌ ఆఫీసర్లను నియమిం చారు. మండలంలో మొత్తం 15 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 70 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల సామ గ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. మండ లంలో 12,846 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - May 12 , 2024 | 10:51 PM