పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్‌బ్యాంకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:08 AM
యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన కార్యవర్గం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి, డిప్యుటీ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్, డీసీబీ నల్లగొండ కార్యాలయం అధికారి జి శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు.

భూదాన్‌పోచంపల్లి, జూన్ 6: యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన కార్యవర్గం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి, డిప్యుటీ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్, డీసీబీ నల్లగొండ కార్యాలయం అధికారి జి శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. పోచంపల్లి బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 14న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పరిశీలన, ఈనెల 15న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తులను ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 21న పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తామని తెలిపారు. పాలకవర్గం సభ్యులు (డైరెక్టర్) 9 స్థానాలు, అందులో ఎస్సీ/ఎస్టీ 1, మహిళల నుంచి 2, జనరల్ క్యాటగిరి నుంచి ఆరుగురు చొప్పున పోటీ చేయవచ్చని తెలిపారు. బ్యాంకు డైరెక్టర్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000, వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు రూ.2,000, ఇరత అభ్యర్థులకు రూ. 4,000 చొప్పున నామినేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఓటు వేయు సభ్యుడు విధిగా తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణాధికారి జి శ్రీనివాస్‌తోపాటు బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్, సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.