మొక్కలు నాటి సంరక్షించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:30 AM
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీవో సంతోష్‌కుమార్ అన్నారు.

చివ్వెంల, జూలై 27: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీవో సంతోష్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో స్కూల్ గార్డెన్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా పూలమొక్కలు, ఆయిర్వేద మొక్కలు, హెర్బల్‌మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం మూలంగా వర్షం కురవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
కోదాడటౌన్: విద్యార్థులు చదువుతో పాటు వివిధ అంశాలపై పరిజ్ఞా నం కలిగి ఉండాలని ఉపాధ్యాయులు అన్నారు. పట్టణంలోని జిల్లా పరి షత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ న్యూట్రిషన్‌డే, ఎకో క్లబ్స్ మిషన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠ శాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలకు నీరు పోసి రక్షణ పెంప కం బాధ్యత విద్యార్థులకు అప్పగించడం, పాఠశాలలో ఆహారం, కూరగా యల కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల ఇన్ చార్జి హెచ్‌ఎం. మార్కండేయ తెలిపారు. కార్యక్రమంలో లింగయ్య, పూర్ణచంద్రరావు, రామకృష్ణ, పద్మావతి, సైదులు, నరసయ్య పాల్గొన్నారు.
మద్దిరాల: నాటి ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీడీవో సత్యనా రాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో నాటిన మొక్కలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బద్దం ఉమ, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, పచ్చిపాల వెంకన్న, వంగూరి రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నాగారం: మొక్కలు ప్రాణకోటికి జీవనాధారమని ఎంపీడీవో ధార శ్రీనివాస్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా నాగారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ హర్షవర్ధన్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం వల్ల పర్యావరణం సమతుల్యత పెరిగి మానవ మనుగడకు ప్రాణాధారం అవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్ధన్, సిబ్బంది యాదగిరి, వినోద, కవిత, శోభరాణి, సరళ తదితరులు పాల్గోన్నారు.