Share News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సైబర్‌ టెర్రరిజం సెక్షన్‌ జోడింపు

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:00 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు సైబర్‌ టెర్రరిజానికి సంబంధించిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(ఎఫ్‌)ను జోడించారు. ఈ మేరకు గురువారం నాంపల్లి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సైబర్‌ టెర్రరిజం సెక్షన్‌ జోడింపు

నాంపల్లి కోర్టులో మెమో.. నిందితుల బెయిల్‌పై నేడు తీర్పు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు సైబర్‌ టెర్రరిజానికి సంబంధించిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(ఎఫ్‌)ను జోడించారు. ఈ మేరకు గురువారం నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభుత్వ విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి, తాను పనిచేసిన సంస్థలో కీలక సమాచారానికి సంబంధించిన ఫైళ్ల యాక్సె్‌సను అందజేయడానికి నిరాకరిస్తే.. దాన్ని సైబర్‌ టెర్రరిజంగా పిలుస్తారు. ఈ కేసులో ప్రణీత్‌రావు చేసిందదేనని దర్యాప్తు అధికారులు గుర్తుచేస్తున్నారు. హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేయడం, బ్యాకప్‌ తీసుకున్న డేటాను యాక్సెస్‌ చేసేందుకు వివరాలు అందజేయకపోవడంతో ఈ సెక్షన్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ఈ సెక్షన్‌ కింద నేరం రుజువైతే.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐటీ చట్టంలోని పలు సెక్షన్లను నమోదు చేశారు. 66(ఎఫ్‌)ను జోడించడంతో కేసు తీవ్రత పెరిగిందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు వివరిస్తున్నారు. కాగా.. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది.

Updated Date - Apr 26 , 2024 | 08:31 AM