Share News

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన పేట కలెక్టర్‌

ABN , Publish Date - May 29 , 2024 | 11:19 PM

పాలమూరు యూని వర్సిటీలో నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల కౌం టింగ్‌ కేంద్రాన్ని నారాయ ణపేట కలెక్టర్‌ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌లు మ యాంక్‌ మిట్టల్‌, అశోక్‌ కుమార్‌లు పరిశీలించారు.

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన పేట కలెక్టర్‌
కౌంటింగ్‌ కేంద్రంలో అధికారులు

మహబూబ్‌నగర్‌, మే 29 : పాలమూరు యూని వర్సిటీలో నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల కౌం టింగ్‌ కేంద్రాన్ని నారాయ ణపేట కలెక్టర్‌ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌లు మ యాంక్‌ మిట్టల్‌, అశోక్‌ కుమార్‌లు పరిశీలించారు. జిల్లాలోని మక్తల్‌, నారా యణపేట నియోజకవర్గా లకు సంబంధించిన ఏర్పా ట్లను పరిశీలించారు. ఏ ర్పాట్లపై పలు సూచనలు, సలహాలు అధికారులకు అందించారు. ఈవీఎం మిషన్‌లు ఏజెంట్లకు స్పష్టంగా కనిపించేలా చూడాలన్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఏర్పాట్లు పకడ్బందీగా, పారదర్శకంగా చేయాలని ఆదేశించారు.

కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత

జూన్‌ నాలుగున పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించనుండటంతో కౌంటింగ్‌ నిర్వహించే పాలమూరు యూనివర్సిటీ దగ్గర పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్రబలగాల నిఘా ఉండగా, ఫలితాల లెక్కింపు సందర్భంగా పొరపాట్లకు తావివ్వకుండా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనుంది. కేంద్ర బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తులో పాల్గొన నున్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాలకు ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలు తీసుకెళ్లకుండా తనిఖీలు చేసిన తరువాతనే అనుమతించనున్నారు.

Updated Date - May 29 , 2024 | 11:19 PM