Share News

ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:25 AM

పేద ప్రజలు, కార్మికులు, అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేసేవారు సమాజంలో తగ్గుతున్నారని, ఇలాంటి తరుణంలో ప్రజలు ఎర్రజెండాను, కమ్యూనిస్టు పార్టీలను కాపాడు కోవా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.

ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కాపాడుకోవాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

సంస్థాన్‌ నారాయణపురం ఫిబ్రవరి 28: పేద ప్రజలు, కార్మికులు, అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేసేవారు సమాజంలో తగ్గుతున్నారని, ఇలాంటి తరుణంలో ప్రజలు ఎర్రజెండాను, కమ్యూనిస్టు పార్టీలను కాపాడు కోవా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో కోతులాపూర్‌ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన సీపీఐ నాయకుడు దివంగత కురిమిద్దె లింగయ్య ప్రథమ వర్ధంతిలో మాట్లాడారు. సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు, ప్రజల పక్షాన ఎర్రజెండా పోరాడుతుందన్నారు. నల్లగొండ జిల్లా పోరాటాలకు పుట్టిల్లు అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పోరాటాలకు నల్లగొండ జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎంతోమంది కమ్యూనిస్టులు వీర యోధులకు జన్మనిచ్చిన త్యాగాలగడ్డ నల్లగొండ జిల్లా అని అన్నారు. నల్లగొండ కాదు ఇది ఎర్రగొండ అని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ సమి తి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాచకొండలో ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగయ్య ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. రాచకొండ గుట్టలో మిగులు భూములను అర్హులైన గిరిజనులు పేదలకు పంపిణీ చేయాలని ఎన్నో భూ పోరాటాలు నిర్వహించి భూ పంపిణీ చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీపీఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధిగా లింగయ్య ఎంతో కృషిచేశారన్నారు. అంతకుముందు లింగయ్య విగ్రహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, స్మారక స్తూపాన్ని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉజ్జని రత్నాకర్‌రావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్దె శ్రీనివాస్‌, బచ్చనగొని గాలయ్య, దుబ్బాక భాస్కర్‌, పల్లె శేఖర్‌రెడ్డి, పొట్ట సత్యం, పొట్ట శంకరయ్య, చిలువేరు అంజయ్య, ఇద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:26 AM