Share News

పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:12 AM

ఉపాధిహామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కా ర్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్‌ చేశా రు.

  పెండింగ్‌ బకాయిలను వెంటనే  చెల్లించాలి
ఏపీవోకి వినతిపత్రం అందజేస్తున్న నారి అయిలయ్య

పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలి

నార్కట్‌పల్లి, జూన 5: ఉపాధిహామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కా ర్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్‌ చేశా రు. ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలను కల్పించాలని, దినసరి కూలీని రూ.600లకు పెంచాలని, ఇతర డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని బుధవారం నార్కట్‌పల్లి ఏపీవోకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ ప థకం కింద పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల కోసం ఈ నెల 8వ తే దీన నల్లగొండలోని ఉపాధి హామీ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య అన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి చ ట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయ త్నం చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో ఉపాఽధి హామీ పథకానికి భారీగా నిధులను కోత పెట్టారని విమర్శించారు. ఆ చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధి కార్మికులపై ఉందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 8వ తేదీన జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు చెర్కు పెద్దులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చింతపల్లి బయ్యన్న, మండల కార్యదర్శి దండు నాగరాజు, దండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 12:12 AM