Share News

పాడి రైతుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN , Publish Date - May 31 , 2024 | 11:53 PM

పాడి రైతులకు పెండింగ్‌ పాల బిల్లులు వెంటనే చెల్లించి లీటరుకు నాలుగు ఇన్సెంటివ్‌ పక్కాయిలు విడుదల చేయాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజ్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పాడి రైతుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
సమావేశంలో మాట్లాడుతున్న బాలరాజ్‌గౌడ్‌

భువనగిరి రూరల్‌, భువనగిరి టౌన్‌, మే 31: పాడి రైతులకు పెండింగ్‌ పాల బిల్లులు వెంటనే చెల్లించి లీటరుకు నాలుగు ఇన్సెంటివ్‌ పక్కాయిలు విడుదల చేయాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజ్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పాడి పరిశ్రమను నమ్ముకొని రాష్ట్రంలో దాదాపు 7.5 లక్షల మంది పాడి రైతులు రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు సంబంధిత డెయిరీలకు విక్రయిస్తున్నారని వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి పాలబిల్లును చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా లీటర్‌కు రూ. నాలుగు ఇన్స్ట్‌ంట్‌ బకాయి చెల్లించాలని లీటర్లకు రూ.5 ఇన్సెంటివ్‌ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. పాడి రైతులకు గడ్డి కట్టర్‌మిషన్‌, పాలు పిండేయాత్రం, దానపై 50శాతం సబ్సిడీతో సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, మంగ నర్సింహులు, బి. కృష్ణారెడ్డి, అలివేల ఆనంద్‌, సత్తిరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీను, విజయ, భాస్కర్‌, పోశెట్టి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:53 PM