పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:25 PM
వెన్యూకు సంబంధించి వివిధ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న దరకాస్తులన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ జి. రవి నాయక్ రెవె న్యూ అధికారులను ఆదేశించారు.

మహబూబ్‌నగర్ (కలెక్టరేట్), జనవరి 12 : రెవెన్యూకు సంబంధించి వివిధ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న దరకాస్తులన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ జి. రవి నాయక్ రెవె న్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీ ల్దార్లు, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వ హించారు. పంపిణీ చేయాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులన్నింటినీ శాసనసభ్యుల ద్వారా పంపిణీ చేయించాలని చెప్పారు. ఆదాయం, కుల ధ్రువపత్రాల దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద 570 వరకు పెండింగ్ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం ఉందని, వాటన్నింటిని వచ్చేవారం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణికి సంబంధించి పంపించే సమాధానాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాత వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. డిసెంబరు తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను మంగళవారంలోగా పరిష్కరించా లని, పెండింగ్ మ్యుటేషన్లు మాత్రం నూటికి నూరు శాతం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వారం నాటికి పెండింగ్ సక్సేషన్లు అన్ని పూర్తి చేయాలని, జీఎల్‌ఎంలో 273 దరఖాస్థులు ఉన్నాయని, వాటిని వచ్చే వారంలోగా పరిష్క రించాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంఽధించి నవంబరు 1 నుంచి ఇప్పటి వరకు జిల్లా లోని 3 నియోజకవర్గాలలో సుమారు 10వేల వరకు వివిధ ఫారమ్స్ పెండింగ్‌లో ఉన్నా యని, వాటిని పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, సర్వేల్యాండ్ రికార్డుల ఏడీ కిషన్ రావు, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, కలెక్టర్ విభాగాల అధిపతులు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీలు ఈ వీసీకి హాజరయ్యారు.