పెచ్చులూడి.. రాళ్లు ఒరిగి..
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:27 AM
మేళ్లచెర్వు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎనఎస్పీ కాలువపై నిర్మించిన వం తెనలు శిథిలావస్థకు చేరుక ున్నాయి.
మేళ్లచెర్వు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎనఎస్పీ కాలువపై నిర్మించిన వం తెనలు శిథిలావస్థకు చేరుక ున్నాయి. 57 ఏండ్ల క్రితం నాగార్జునసాగర్ కాల్వల నిర్మాణ సమయంలో రాతి కట్టడంతో నిర్మించిన వంతె నలు సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచ ుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. మేళ్ల చెర్వు, ఎర్రగట్టు తండా, రైల్వే అండర్‌పాస్, రైతు నగర్ బ్రిడ్జి మొత్తం నాలుగు వంతె నలకు సపోర్టుగా కట్టిన రాతి గోడలకు పెచ్చు లూడి, రాళ్లు వొరిగాయి. బ్రిడ్జి కింద భాగంలో పెచ్చులూడిపోయి, బ్రిడ్జి పక్కన ఉన్న సైడ్ వాల్స్ కూలిపోయి ప్రమాదకరంగా మారి బ్రిడ్జిలు ఉన్నాయి.
ప్రమాదపుటంచున ప్రయాణం
గ్రామం అంతా కాల్వకు ఒక పక్క, వ్యవసాయ భూములు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఫ్యాక్టరీలు మరో పక్కన ఉండడంతో ఈ వంతె నల గుండా నిత్యం వందలాది వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. బీటలు వాలిన వంతె నలు ఎప్పుడు పడిపోతాయో తెలియని స్థాని కులు బిక్కుబిక్కుమంటూ ప్రమాదం అంచున ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు ప్రమాదం జరగక ముం దే ఈ బ్రిడ్జిల స్థానంలో నూత న బ్రిడ్జిలను నిర్మించాలని స్థానికులు కోరుకుం టున్నారు.
ఐదేండ్లుగా భారీ వాహనాలు నిలిపివేత
మండల కేంద్రంలోని ఎర్రగట్టు తండా, ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న బ్రిడ్జిలపై నుంచి సాధారణ, రైతు వాహనాలకు మాత్రమే అను మతి ఇస్తున్నారు. లారీలు, టిప్పర్లు వంటి భారీ వాహనాలకు రాకపోకలుసాగిస్తే, వంతెనలు కూలిపోతాయని, ఐదేండ్లుగా ఈ వంతెనల మీద నుంచి భారీ వాహనాలను గ్రామస్తులు అనుమతించడం లేదు.