Share News

దైవచింతనతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:11 AM

దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌పద్మావతిరెడ్డి అన్నా రు.

దైవచింతనతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి

మోతె, జనవరి 6: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌పద్మావతిరెడ్డి అన్నా రు. మండల పరిధిలోని తుమ్మలపల్లిలో సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట, నూతన ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆమె పాల్గొన్నారు. ప్రజలందరూ కులమ తాలకతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం ఇటీవల నేషనల్‌ చాంపియన్‌ షిప్‌లో మూడో స్థానం, రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించిన మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన కత్తుల సల్మాన్‌రాజ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సర్పం చ్‌ వాసంశెట్టి రమేష్‌, నంద్యాల అరుణ, కీసర సంతోష్‌రెడ్డి, నూకల మధుసూదన్‌రెడ్డి, వాసంశెట్టి శేఖర్‌, నరేష్‌, రాములునాయక్‌ ఉన్నారు.

కోదాడ రూరల్‌: దైవచింతన కోసం కొంత సమయం కేటాయించాల్సిన అవసరముందని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మండలంలోని కొమరబండలో షిరిడి సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ పొనుగోటి జానకిరామయ్య, వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:11 AM