Share News

‘కవ్వాల్‌’ నుంచి పల్లెల తరలింపు

ABN , Publish Date - May 03 , 2024 | 04:35 AM

వ్వాల్‌ పులుల అభయారణ్యం నుంచి మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం

‘కవ్వాల్‌’ నుంచి పల్లెల తరలింపు

94 కుటుంబాలకు పునరావాసం: పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌

కవ్వాల్‌ పులుల అభయారణ్యం నుంచి మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ తెలిపారు. ఆ గ్రామాలకు చెందిన 94 కుటుంబాలను పునరావాసం కల్పించినట్లు చెప్పారు. మొదటి ప్రతిపాదనగా ఒక్కో కుటుంబానికి ఏకమొత్తంగా రూ.15 లక్షల పరిహారం అందించాలని అటవీశాఖ నిర్ణయించగా దీనికి 48 కుటుంబాలు అంగీకరించి పరిహారం స్వీకరిస్తున్నాయి. ఇక రెండో ప్రతిపాదనకు అంగీకరించిన 94 కుంటుంబాలకు అవే రూ.15 లక్షల పరిహారంలో భాగంగా ఒక ఇంటి నిర్మాణంతో పాటు వ్యవసాయ భూమిని అందించేందుకు అటవీశాఖ అక్కడి గిరిజనులను ఒప్పించింది. ఈ రెండు గ్రామాల్లో 142 కుటుంబాలను పునరావాసం కోసం ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.14.2 కోట్లు మంజూరు చేసింది.

Updated Date - May 03 , 2024 | 08:47 AM