Share News

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:26 PM

పాలమూరు పురపాలికలో పారిశుధ్య నిర్వహణ కోసం అధికప్రాధాన్యత ఇవ్వాలని అడి షనల్‌ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఫాగింగ్‌ మిషన్‌లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌

- ప్రతీరోజు ఫాగింగ్‌ తప్పనిసరి : అధికారులతో అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 21 : పాలమూరు పురపాలికలో పారిశుధ్య నిర్వహణ కోసం అధికప్రాధాన్యత ఇవ్వాలని అడి షనల్‌ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. దోమల కారణంగా డెంగీ కేసులు ప్రబలుతున్నం దున పారిశుధ్యంపై దృష్టి సారిం చాలని సూచించారు. ప్రతీ వార్డు లో విధిగా ఫాగింగ్‌ చేయా లన్నారు. పురపాలికకు నూత నంగా 6 ఫాగింగ్‌ మిషన్‌లు వచ్చినందున ప్రతీ రోజు ఒక్కో మిషన్‌తో ఒక వార్డులో ఫాగింగ్‌ చేయాలని తెలిపా రు. బుధవారం సాయంత్రం ఆయన మునిసిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలతో పాటు ఇతర వాహ నాలకు ట్రాకింగ్‌ విధానం అమలు చేయాలని, పారి శుధ్య సిబ్బంది చేత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తీసుకో వాలన్నారు. ఇక పురపాలిక పరిధిలో అదె ్దదుకాణాల అద్దె వసూలుపై దృష్ఠిసారించాలని, వందశాతం అద్దె వసూలుకావాలని, ప్రాపర్టీ టాక్స్‌పై కూడా దృష్ఠి సారించి లక్ష్యం మేరకు వసూళు చేయాలని ఆదేశిం చారు. లీజు పూర్తైన దుకాణాల వేలంపాట కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, రెవెన్యూ అధికారి ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:28 PM