Share News

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - May 15 , 2024 | 11:13 PM

పట్టణా ల్లో, గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సా రించాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ ఆదేశించారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జి. రవినాయక్‌

- కలెక్టర్‌ జి. రవినాయక్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), మే 15 : పట్టణా ల్లో, గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సా రించాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమ న్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న కార్యక్ర మాలను సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లా డుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, మురుగు కా లువలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. పార్లమెంట్‌, స్థానికసంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిల పోలింగ్‌ సాఫీగా ముగిసిందని, ఎన్నికలలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బం దిని ఆయన అభినందించారు. ఎన్నికల కౌంటింగ్‌ కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూ చించారు. పోలింగ్‌ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల భవనాలలో బయట, లోపల క్లీనింగ్‌ చేయాలని సూచించారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే తరలించాల న్నారు. అదేవిధంగా ట్యాబ్‌ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు మానిటర్‌ చేయాల న్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాల కల్పన వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. విద్యార్థులకు యూనిఫామ్‌ల కుట్టు పనులు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణీ పోర్టల్‌ ద్వారా వివిధ మాడ్యూల్‌లో పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించా లన్నారు. ప్రజావాణిలో పెండింగ్‌ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. ఈ- ఆఫీస్‌ లో 15 రోజుల నుంచి ఉన్న పెండింగ్‌లను చూడా లన్నారు. బ్లాక్‌ ప్లానిటేషన్‌, లీనియర్‌ ప్లానిటేషన్‌, పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు వాటరింగ్‌ చేయాలన్నారు. ప్రతీ మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు క్లీనింగ్‌ నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్సియల్‌ పాఠశాలలు, హాస్టల్‌లలో మరమ్మతు పనులు పాఠశాలలు ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద జాబ్‌ కార్డు కూలీలకు పనులు కల్పించాలన్నారు. కలెక్టరేట్‌లో బయోమెట్రిక్‌ ద్వారా సిబ్బంది హాజరును సంబం ధిత అధికారులు సమీక్షించాలని సూచించారు. గ్రా మాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూ చించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:13 PM