Share News

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:55 PM

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించా రు.

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌

- వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), మార్చి 12 : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించా రు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ విషయమై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచ నలు చేశారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందించాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణకు ప్రింటింగ్‌ ప్రెస్‌ను ముందే గుర్తిం చాలని, హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ సక్ర మ నిర్వహణకు సరైన ప్రణాళిక ముందు నుంచే సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల నోటిఫి కేష న్‌ వెలువడినప్పటి నుంచిఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా అవసర మైన వీడియో సర్వేలెన్స్‌, వీడియో వీక్షణ తదితర పనుల కోసం అవసరమైన కెమెరాలను ముందే సిద్ధం చేసుకోవాలని, మంచి మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సమ స్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఈనెల 13 లోగా పంపించాలని, తదితర సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంశాలపై వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ జి. రవినాయక్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రసాద్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావు, డీఆర్వో కేవీవీ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 10:55 PM