అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:34 AM
కార్పొరేషన్లు, మున్సిపా లిటీల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు.

నల్లగొండ టౌన్, జూన్ 26: కార్పొరేషన్లు, మున్సిపా లిటీల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మునిసిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. జీవో 1037లో ప్రతిపా దించిన మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పజెప్పాలని నిర్ణయాలను ఉపస ంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ మునిసిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లు తెలంగాణలో కూడా రూ.21వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాంకీ తదితర పైవ్రేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. కొత్తగా నియమించిన కార్మికులకు పాత కార్మి కులతో సమానంగా వేతనాలు పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాల న్నారు. ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు దండెంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండమల్ల శ్రీనివాస్, నాయ కులు పెరిక కృష్ణ, కత్తుల సైదులు, యేసు, తారమ్మ, కొత్తపల్లి జంగయ్య ఎస్కే జానీ, నరసింహ, వెంకట్‌రెడ్డి, నరసమ్మ, శోభ, చంద్రమ్మ, సైదమ్మ, పద్మ, నాగరాజు, లింగయ్య పాల్గొన్నారు.