పక్కా ప్రణాళికతో ఎన్నికల బందోబస్తు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:27 PM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్ర శాంతంగా నిర్వహించడంపై పోలీస్‌శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళుతుం దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు.

- నియోజకవర్గ పోలీస్ ఇన్‌చార్జిలతో ఎస్పీ హర్షవర్ధన్
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్ర శాంతంగా నిర్వహించడంపై పోలీస్‌శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళుతుం దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. అన్ని ప్రాంతాలలో పోలీసులు అప్రమ త్తంగా ఉండి ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాల పోలీస్ ఇంచార్జిలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మద్యం, నగదు రవాణాపై నిఘా పెట్టాలని తెలిపారు. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు సమన్వయంతో పని చేయాలని కోరారు. నిరంతరం వాహనాలను తనిఖీ చేయాలని, చెక్‌పోస్ట్‌ల దగ్గర అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బి డీఎస్పీ రమణారెడ్డి, డీటీసీ డీఎస్పీ నర్సింహులు, నారాయణపేట డీఎస్పీ లింగయ్య, నారాయణపేట డీసీఆర్‌బీ డీఎస్పీ మహేశ్, షాద్‌నగర్ డీఎస్పీ రంగస్వామి, పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.