Share News

తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:18 PM

రాష్ట్రంలో 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభు త్వంపై తక్కువ సమయంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.

తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత

- బీఆర్‌ఎస్‌ దశాబ్ది ఉత్సవాల ముగింపులో నేతల స్పష్ఠీకరణ

మహబూబ్‌నగర్‌, జూన్‌ 3 : రాష్ట్రంలో 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభు త్వంపై తక్కువ సమయంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. రాను న్న రోజుల్లో బీఆర్‌ఎస్‌కు మంచిరోజులు వస్తాయ ని, ప్రజలు బీఆర్‌ఎస్‌ను కోరుకుంటున్నారని చెప్పా రు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భగా సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ఆవరణలో మాజీమంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ జాతీయజెండాను, మాజీమంత్రి డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంత రం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డిలు మాట్లాడారు. కేసీఆర్‌ చేసిన పోరాటం, ఉద్యమాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. ఉద్యమాన్ని వ్యూహాత్మ కంగా నడిపించడం వల్లే రాష్ట్రం ఏర్పా టైందన్నా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికలు మోదీ, రాహుల్‌గాంధీ మధ్యన జరిగాయని, తెలంగాణ ప్ర జలు మాత్రం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉండాలని కోరుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలో బీఆర్‌ఎస్‌ విజయమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ అనాధ ఆశ్రమంలో విద్యార్థులకు స్కూల్‌బ్యాగ్‌లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇంతియాజ్‌ఇసాక్‌, రాజేశ్వర్‌గౌడ్‌, కోడ్గల్‌యాదయ్య, కోరమోని నర్సింహులు, గంజి ఎంకన్న, సుధాశ్రీ, బాలరాజు, కోరమోని వెంకటయ్య, గోపాల్‌యాదవ్‌, కరుణాకర్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, శివరాజు, దేవేందర్‌రెడ డ్డి, తాటిగణే్‌ష, నవకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ రూ.2 లక్షల చెక్కు అందజేత : హన్వాడ మండలం కొత్తతండాకు చెందిన విస్లావత్‌ సౌమ్య నాయక్‌ కుటుంబ సభ్యులకు నాయకులు రూ.2 లక్షల చెక్కు అందజేశారు. ఇటీవల సౌమ్య ప్రమాదవ శాత్తు చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున చెక్కు అందజేశారు.

Updated Date - Jun 03 , 2024 | 11:18 PM