Share News

Manchiryāla- కొనసాగుతున్న నిరవధిక దీక్ష

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:50 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలి వాహన పవర్‌ ప్లాంటు ఎదుట కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. కార్మికుల హక్కుల సాధన కోసం భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Manchiryāla-    కొనసాగుతున్న నిరవధిక దీక్ష
దీక్షలు చేస్తున్న శాలివాహన ప్లాంటు కార్మికులు

ఏసీసీ, ఫిబ్రవరి 2: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలి వాహన పవర్‌ ప్లాంటు ఎదుట కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. కార్మికుల హక్కుల సాధన కోసం భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు ఎడ్ల శ్రీనివాస్‌, కుంటాల శంకర్‌ మాట్లాడుతూ పవర్‌ప్లాంట్‌ మూసివేసి 14 నెలలు కావస్తున్నా కార్మికులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన క్లోజింగ్‌ బెనిఫిట్స్‌ చెల్లించకుండా ప్లాంటు అధినేత మల్క కొమురయ్య మొండిగా వ్యవహ రిస్తున్నారన్నారు. మంచిర్యాల అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ గతంలో కార్మికులకు యాజ మాన్యానికి నిర్వహించిన జాయింట్‌ మీటింగ్‌లో కూడా బెనిఫిట్స్‌ చెల్లిస్తామని యాజమాన్యం ఒప్పుకుందన్నారు. ఇప్పటికి చెల్లించకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ప్లాంటు నిర్మాణ సమయంలో రూ. 30 వేలు, రూ.40 వేల మధ్య ఎకరంభూమి కొనుగోలు చేసి భూని ర్వాసితులకు కూడా న్యాయం చేయలేదన్నారు. ప్రస్తుతం ప్లాంటు భూముల విలువ భారీగా పెరగడంతో వాటిని విక్రయించి కార్మికులకు బెనిఫిట్స్‌ చెల్లించకుండా జారుకోవాలని కుట్రలు పన్నుతుందన్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్‌ నాయ కులు కమలాకర్‌, రాజు యాదవ్‌ సత్యనారాయణ, ఆనందరావు, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:50 PM