రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:36 AM
కేతేపల్లి మండలంలో శనివారం జరిగిన రెం డు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కేతేపల్లి మండలకేంద్రంలోని హైదరాబాద్-విజయవాడ జాతీ య రహదారిపై ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎస్‌ఐ శివతేజగౌడ్, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి
ఇరువురికి తీవ్ర గాయాలు
కేతేపల్లి, జూలై 27: కేతేపల్లి మండలంలో శనివారం జరిగిన రెం డు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కేతేపల్లి మండలకేంద్రంలోని హైదరాబాద్-విజయవాడ జాతీ య రహదారిపై ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎస్‌ఐ శివతేజగౌడ్, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి వెంక న్న (50) అదే గ్రామానికి చెందిన చింత నర్సింహతో కలిసి రోజూ నకిరేకల్ పట్టణంలో తా పీపనికి వెళ్తుంటాడు. శనివారం పనికి వెళ్లిన వెంకన్న, చింత నర్సింహ తిరిగి ఇంటికి బయలుదేరారు. కేతేపల్లిలో డీపౌల్ స్కూల్ వద్ద గల జంక్షన్‌లో హైవే రోడ్డు దాటుతుండగా వారి వెనకాల వస్తున్న వ్యాన వీరి మోపెడ్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర మాదం లో మోపెడ్ వెనక కూర్చున్న కందికంటి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందగా మోపెడ్ న డుపుతున్న నర్సింహకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివతేజగౌడ్ సం ఘటనా స్థలానికి చేరుకుని వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నర్సింహను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెంకన్నకు భా ర్య, కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యానను స్వాధీనం చేసుకుని పో లీస్‌స్టేషనకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.
సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంట కు చెందిన శంతం చంద్రం హైదరాబాద్ నుం చి తన ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు వెళ్తున్నాడు. మండల కేంద్రంలోని నిమ్మలమ్మ చెరు వు అండర్‌పాసింగ్ వంతెన మీదకు రాగానే వె నుక నుంచి వస్తున్న మరో వాహనం బైక్ దగ్గరికి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం తప్పించుకునేందుకు చంద్రం తన వాహనాన్ని రోడ్డు చివరి అంచుకు తీసుకువెళ్లాడు. ఇదే సమయం లో అదుపుతప్పిన బైక్ ఇనుప డివైడర్‌కు ఢీకొట్టింది. దీంతో పట్టుతప్పి తను డివైడర్ మీద నుంచి పక్కకు పడిపోయాడు. బైక్ దానంతట అదే దాదాపు 150అడుగుల దూరం వెళ్లి రో డ్డు మధ్యలో గల డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయింది. ఇనుప డివైడర్‌కు బలంగా తాకడంతో చంద్రం పొట్ట తెగి కడుపులో పేగులు బయటకు రావడంతో పాటు ఎడమ చెయ్యి రెండు చోట్ల విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సర్వీసు సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రాస్పతికి తరలించారు. చంద్రం సూర్యాపేట కోర్టులో విధులు నిర్వహిస్తారని తెలిసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివతేజగౌడ్ తెలిపారు.