Share News

పులిజాడ కోసం గాలించిన అధికారులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:29 AM

నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ లిం గోటం, ఎం.ఎడవల్లి, పోతినేనిపల్లె గ్రామాల శివార్లలో పులి సంచరించిందన్న పుకార్ల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సోమవారం ఆ యా గ్రామాల్లో తనిఖీ చేశారు.

  పులిజాడ కోసం గాలించిన అధికారులు
ఎం.ఎడవల్లి, స్పెక్ర్టా శివార్లలో పరిశీలిస్తున్న అటవీ అధికారులు

పులిజాడ కోసం గాలించిన అధికారులు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 12: నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ లిం గోటం, ఎం.ఎడవల్లి, పోతినేనిపల్లె గ్రామాల శివార్లలో పులి సంచరించిందన్న పుకార్ల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సోమవారం ఆ యా గ్రామాల్లో తనిఖీ చేశారు. న ల్లగొండ, మిర్యాలగూడ ఎఫ్‌ఆర్‌వో లు బాచిరెడ్డి, ఆనంద్‌, చిట్యాల, నకిరేకల్‌ ఎస్‌ఎ్‌ఫవోలు మల్లారెడ్డి, అశో క్‌రెడ్డి, నార్కట్‌పల్లి ఎఫ్‌బీవో భవాని పులి జాడ కోసం గాలించారు. ఆదిమల్ల వెంకన్నతో పాటు ఆయా గ్రామస్థులను వెంట బె ట్టుకుని పరిసర ప్రాంతాలను గాలించి పరిశీలించారు. ఎక్కడా పులి సంచరించిన ఆనవాళ్లు లభించలేదన్నారు. ఎక్కడా పులి అడుగులు కనపడలేదని, పులి సంచరిస్తుందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం నిజం కాకపోవచ్చని అన్నారు. అయినా ప్రజల్లో ధైర్యం కోసం మరోసారి పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:29 AM