Share News

అధికారులు మండల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:34 AM

మండల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

 అధికారులు మండల అభివృద్ధికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

అధికారులు మండల అభివృద్ధికి కృషి చేయాలి

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

అడవిదేవులపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఏర్పాటు చే సిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలని లేకుంటే బదిలీపై వెళ్లాలని సూచించా రు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారు ఎదుర్కొంటున్న స మస్యల పరిష్కారానికి కృ షి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు అ ర్హులకు అందేలా చూడాలని అన్నారు. రెండేళ్లలో దున్నపోతులగండి ప్రాజెక్టు పనులను పూర్తి చే సి మండలంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అం దించే విధంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డి.దస్రునాయక్‌, తహసీల్దార్‌ సురేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు రమావత బాలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:35 AM