Share News

కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించిన పరిశీలకులు

ABN , Publish Date - May 08 , 2024 | 11:26 PM

చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల కోసం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌, కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రాలు బుధవారం పరిశీలించారు.

కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించిన పరిశీలకులు
ఎంసిఎంసి కేంద్రాన్ని, కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు

రంగారెడ్డి అర్బన్‌, మే 8 : చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల కోసం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌, కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రాలు బుధవారం పరిశీలించారు. ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్‌ రూంను పరిశీలించారు. 1950 టోల్‌ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరును గమనించారు. అబ్జర్వర్ల వెంట డీఆర్వో సంగీత, సంబంధిత అధికారులున్నారు.

Updated Date - May 08 , 2024 | 11:26 PM