Share News

చిన్నచూపు తగదు

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:49 PM

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి అన్నారు.

చిన్నచూపు తగదు
కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు, నాయకులు

- కలెక్టరేట్‌ ముందు ఆందోళనలో సంఘం నాయకులు

పాలమూరు, మార్చి 12 : అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి అన్నారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టాలనే విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకపూట బడితోపాటు మే నెల పూర్తిగా టీచర్స్‌, హెల్పర్స్‌కు సెలవులు ఇవ్వాలని కోరారు. పనిచేయని సెల్‌ఫోన్లు తక్షణ మే తీసుకుని వాటిస్థానంలో కొత్త 5జీ ట్యాబులు ఇవ్వాలన్నారు. జీ.వో నెంబర్‌ 14, 19, 8లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సరోజ, ప్రభావతి, రాజ్యలక్ష్మి, గౌసియాబేగం, పద్మ, కవిత, కమల ప్రసంగించారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌, డీడబ్ల్యూవోతో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని ఏఓ హామీ ఇచ్చారని తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 10:49 PM