Share News

ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:29 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నిల అధికారి జి. రవినాయక్‌ చెప్పారు.

ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ
మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి. రవి నాయక్‌

- కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి. రవినాయక్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 18 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నిల అధికారి జి. రవినాయక్‌ చెప్పారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ పార్రంభమైందని, ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు ఉంటుందని తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన, ఎస్పీ హర్షవర్ధన్‌తో కలిసి మాట్లాడారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడులైందని, ఏప్రిల్‌ 18న ఫారం-1, నోటిఫికేషన్‌ విడదలైందని అన్నారు. నోటిఫికేషన్‌ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారంభం అవుతుందన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ రోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను వేశారని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలిపారు. 26న నామినేషన్‌ పత్రాల స్క్నూట్ని, 29 మధ్యాహ్నం మూడు గంటల వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగరర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏడు సెగ్మెంట్లు ఉన్నాయని, ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో ఏఆర్‌వో ఉంటారని తెలిపారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు మొత్తం 1,937 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. మొత్తం ఓటర్లు 16,80,417 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల కౌంటిం గ్‌కు పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎన్నికల సంఘం పీడ బ్ల్యూడీ ఓటర్లకు (32,731 మంది), 80 సంవత్సరాలకు పైబడిన ఓటర్లకు (6047 మంది) ఇంటిదగ్గరే ఉండి ఓటు వేసే అవకాశాన్ని కల్పించిందన్నారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1954 లేదా సీ విజిల్‌ యాప్‌ ద్వారా చేయవచ్చని తెలిపారు. ఏదేని అనుమతులు పొందేందుకు సువిధ యాప్‌ ద్వారా అనుమతులు పొందవచ్చని, ఇప్పటి వరకు 340 వాహనాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అదనపు బలగాను రప్పించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:29 PM