Share News

ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:09 AM

చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తం 64 నామినేషన్లను దాఖలు కాగా, 18నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.46 మంది అభ్యర్థులు నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఆమోదించారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి 114 నామినేషన్లు దాఖలు కాగా 22 మంది బరిలో నిలిచారు. అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించారు.

ముగిసిన నామినేషన్ల ఘట్టం
నామినేషన్‌ ఉపసంహర పత్రాన్ని ఆర్వోకు అందజేస్తున్న బీఎస్పీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (29ఆర్‌ఆర్‌03) ఉపసం

చేవెళ్ల సెగ్మెంట్‌లో ముగ్గురు అభ్యర్థులు విత్‌ డ్రా..

బీఎస్పీ అభ్యర్థితో పాటు ఇద్దరు స్వతంత్రులు

చేవెళ్ల పార్లమెంట్‌ బరిలో 43 మంది అభ్యర్థులు

మల్కాజ్‌గిరి బరిలో 22 మంది ..

అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయింపు

చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తం 64 నామినేషన్లను దాఖలు కాగా, 18నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.46 మంది అభ్యర్థులు నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఆమోదించారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి 114 నామినేషన్లు దాఖలు కాగా 22 మంది బరిలో నిలిచారు. అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించారు.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌, ఏప్రిల్‌ 29 : చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ ముగిసింది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తం 64 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 26వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 46మంది అభ్యర్థులు నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఆమోదించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలోనిలిచిన 43 మంది అభ్యర్థులకు సాధారణ పరిశీలకులు, రాజేందర్‌కుమార్‌ కటారియా అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు.

ఉపసంహరించుకున్న అభ్యర్థులు వీరే

స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన మహ్మద్‌ చాంద్‌పాష్‌, దూదేకుల ఇమామ్‌ హుస్సేన్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శశాంకకు విత్‌డ్రా ఫారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం జనరల్‌ అబ్జర్వర్‌ రాజేందర్‌కుమార్‌ కటారియా, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పాల్గొన్నారు.

మల్కాజ్‌గిరి బరిలో 22 మంది ...

మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానానికి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్లుదాఖలు చేశారు. పరిశీలనలో 77 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 37 మంది అభ్యర్థుల నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు 15 మంది అభ్యర్థులు తమ నామినే షన్లను ఉపసంహరించుకోగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వారికి ఎన్నికల అధికారి తెలిపారు. అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించినట్లు తెలిపారు.

మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారిపై సీఈఓకు ఫిర్యాదు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌పై సోమవారం నామినేషన్లు తిరస్కరణకు గురైన 77మంది అభ్యర్ధులు సీఈఓ వికా్‌సరాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 77 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లను పరిశీలనలో తిరస్కరించారు. దీంతో తిరస్కరణకు గురైన అభ్యర్ధులు సీఈఓ వికా్‌సరాజ్‌ను కలిసి చిన్న చిన్న కారణాలతో తమ నామినేషన్‌లను తిరస్కరించారని ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. అవసరమైతే తాము న్యాయపరంగా వెళుతామని స్వతంత్ర అభ్యర్ధులు తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 12:50 AM