Share News

ముగిసిన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:32 PM

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి చివరిరోజు జోరుగా నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఈమేరకు గురువారం 61 మంది 91 సెట్లు దాఖలు చేసినట్లు మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 114 మంది అభ్యర్ధులకు గాను, 177 సెట్లు దాఖలు చేసినట్లు తెలిపారు.

ముగిసిన నామినేషన్ల పర్వం

మల్కాజ్‌గిరికి చివరి రోజు 61మంది 91 సెట్లు

మొత్తం 114 మంది 177 సెట్లు దాఖలు

చేవెళ్లకు చివరి రోజు 31 నామినేషన్లు

ఇప్పటి వరకూ మొత్తం 66 మంది 87 దాఖలు

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌/రంగారెడ్డిఅర్బన్‌, ఏప్రిల్‌ 25: మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి చివరిరోజు జోరుగా నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఈమేరకు గురువారం 61 మంది 91 సెట్లు దాఖలు చేసినట్లు మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 114 మంది అభ్యర్ధులకు గాను, 177 సెట్లు దాఖలు చేసినట్లు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 66 మంది అభ్యర్థులు 87 సెట్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి శశాంకకు అందజేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా ఈసరి సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థిగా కె.విశ్వేశ్వర్‌రెడ్డి, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా గోపిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బానోత్‌ వెంకన్న, స్వతంత్ర అభ్యర్థిగా నీరటి ఆంజనేయులు, ప్రజావెలుగు పార్టీ అభ్యర్థిగా టి. దుర్గప్రసాద్‌, స్వతంత్ర అభ్యర్థిగా మహ్మద్‌ రియాజుర్‌ రెహ్మన్‌షేక్‌, స్వతంత్ర అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున కాసాని వీరేష్‌, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా పాలమాకుల మధు, స్వతంత్ర అభ్యర్థిగా రాచమల్ల రాజేష్‌, తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా నర్సింహారెడ్డి ద్యాపా, అన్న వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థిగా ఇబ్రహీం ఉల్‌హక్‌, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా తోట్ల రాఘవేందర్‌, స్వతంత్ర అభ్యర్థులుగా జి. మల్లే్‌షగౌడ్‌, కావలి సుకుమార్‌, దూదేకుల ఇమామ్‌ హుస్సేన్‌, జలీల్‌ అహ్మద్‌, కొంపల్లి అనంతరెడ్డి, ఎస్కే సమీర్‌, శ్రీనివా్‌సరావ్‌ జాదవ్‌, సయ్యద్‌ ఇబ్రహీం, కాత్రవత్‌ శివాణి కాత్రవత్‌ శ్రావణి, నామినేషన్‌ వేశారు. అలాగే రాష్ర్టీయ సామాన్య ప్రజాపార్టీ అభ్యర్థిగా వసంత్‌ కుమార్‌, బ్లూ ఇండియా పార్టీ అభ్యర్థిగా చింతలగారి వెంకటస్వామి, రెవెల్యూషన్‌ సొసైౖటీ పార్టీ అభ్యర్థిగా గాదె రంజిత్‌రెడ్డి, జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ అభ్యర్థిగా బొమినెల్లి ప్రభాకర్‌, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా బింగి రాములు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక నేటి నుంచి నామినేషన్‌ పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్ల విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

Updated Date - Apr 25 , 2024 | 11:32 PM