Share News

జీతాలకు డబ్బుల్లేవు.. దయచేసి నిధులివ్వండి

ABN , Publish Date - May 03 , 2024 | 04:34 AM

నిధులు లేక కృష్ణా బోర్డు నిర్వహణ కనాకష్టంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాంతో బోర్డు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, నిధులు విడుదల చేయాలని తెలంగాణ

జీతాలకు డబ్బుల్లేవు.. దయచేసి నిధులివ్వండి

తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

హైదరాబాద్‌, మే 2(ఆంధ్రజ్యోతి): నిధులు లేక కృష్ణా బోర్డు నిర్వహణ కనాకష్టంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాంతో బోర్డు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే లేఖ రాశారు. ఏపీపునర్‌వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్‌-86(2) ప్రకారం బోర్డు నిర్వహణకు నిధులు సమకూర్చడం తెలుగు రాష్ట్రాల బాధ్యత అని లేఖలో గుర్తు చేశారు.

Updated Date - May 03 , 2024 | 08:55 AM