Share News

ఆర్మూర్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:09 AM

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం నెగ్గింది. మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడంతో వినీత తన పదవిని కోల్పోయారు.

ఆర్మూర్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

పదవి కోల్పోయిన పండిత్‌ వినీత

ఆర్మూర్‌టౌన్‌ , జనవరి 4 : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం నెగ్గింది. మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడంతో వినీత తన పదవిని కోల్పోయారు. ఆర్మూర్‌ మునిసిపాలిటీలో మొత్తం 36మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన సమావేశానికి 20మంది బీఆర్‌ఎస్‌, నలుగురు బీజేపీ కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌ ఆఫీషియో సభ్యుడి హోదాలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకే్‌షరెడ్డి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి సరిపడా కోరం సభ్యులు హాజరుకావడంతో తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. ఓటింగ్‌లో పాల్గొన్న వారంతా అవిశ్వాసానికి మద్దతు పలికారు. చైర్‌పర్సన్‌ వర్గీయులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. అవిశ్వాస తీర్మాన ప్రతిని అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. నూతన చైర్మన్‌ ఎన్నికపై త్వరలోనే ప్రకటన రానుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే కౌన్సిలర్లు బస్సులో క్యాంపునకు బయలుదేరి వెళ్లిపోయారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన బీజేపీ.. చైర్మన్‌ ఎన్నికలో బీఆర్‌ఎ్‌సకు సహకరిస్తుందా లేదా చూడాల్సి ఉంది.

Updated Date - Jan 05 , 2024 | 04:09 AM