Share News

న్యూ ఇయర్‌ హంగామా

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:19 PM

నూతన సంవత్సర వేడుకలను వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి నుంచి విందులు, వినోదాలు, కేరింతలు, నృత్యాలతో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

   న్యూ ఇయర్‌ హంగామా

యువతీ యువకుల్లో కొత్త సందడి

వికారాబాద్‌/కీసర, : నూతన సంవత్సర వేడుకలను వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి నుంచి విందులు, వినోదాలు, కేరింతలు, నృత్యాలతో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నూతన సంవత్సరం రోజు ఉదయాన్నే లేచి ఆలయాలకు వెళ్లారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామునే ఇళ్ల ఎదుట రంగవల్లులను అందంగా తీర్చిదిద్ది 2024కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి, అనంతపద్మనాభ స్వామి, చీర్యాల్‌ లక్ష్మీనరసింహస్వామి, పాంబండ శ్రీ రామలింగేశ్వరస్వామి తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతగిరులు, కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. కాగా సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై ను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చంఅందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Jan 01 , 2024 | 11:23 PM