Share News

త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ

ABN , Publish Date - Jan 11 , 2024 | 04:13 AM

రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, పారిశ్రామిక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ,

త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ

పారిశ్రామిక రంగానికి

నూతనోత్తేజం తెస్తాం

ప్రజలు కోరుకున్న మార్పు చూపిస్తాం

సీఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ ప్రతినిధులతో

పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని

అప్పుల కుప్పగా చేసిందని ధ్వజం

హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, పారిశ్రామిక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. దీనికోసం అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఈ పాలసీ మరింత మెరుగ్గా, పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఎఫ్టీసీసీఐ, ఫిక్కీ, సీఐఐ, ఎఫ్టీఎ్‌సఏసీ, డిక్కీ సంస్థల ప్రతినిధులతో మంత్రి బుధవారం సచివాలయంలో మాట్లాడారు. ‘ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనను వ్యతిరేకించి కాంగ్రె్‌సకు అధికారం కట్టబెట్టారు. ప్రజలు ఆశించిన విధంగా మార్పు తెచ్చి చూపిస్తాం’ అని శ్రీధర్‌ బాబు అన్నారు. పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందని, మళ్లీ నూతనోత్తేజం తీసుకొస్తామని తెలిపారు. ప్లాన్‌ 2050 గురించి సీఎం రేవంత్‌ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ ఈ ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా అభివృద్ధి చెందిందని, అభివృద్ధి చెందిన దేశాలు హైదరాబాద్‌ను ఫార్మా పరిశ్రమ హబ్‌గా గుర్తిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో మిస్సైల్‌ తయారై ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతోందంటే పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. పరిశ్రమలకు నూతనోత్తేజాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. చైనాకు మించి మనమూ అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అర్బన్‌ క్లస్టర్‌.. రీజినల్‌ క్లస్టర్‌.. సెమీ అర్బన్‌ క్లస్టర్‌.. ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించబోతున్నామన్నారు. డ్రైపోర్ట్‌పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నామని, నల్గొండతోపాటు కనెక్ట్‌ టు ఓల్డ్‌ ముంబై హైవే ప్రాంతాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొందరు కావాలని కాంగ్రె్‌సను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్‌ ఉద్దేశమని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు.

ఏరోస్పేస్‌ రంగానికి స్వర్గధామంగా..

ఏరో ేస్పస్‌ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఏరో ేస్పస్‌ ఏకోసిస్టమ్‌ ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఏరోస్పేస్‌ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా మారిందన్నారు. శంషాబాద్‌లోని అదానీ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ సెంటర్‌లో భారతీయ నేవీ కోసం అదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి 10 స్టార్‌ లైనర్‌ మానవరహిత ఏరియల్‌ వాహనం (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీధర్‌ బాబు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏరో ేస్పస్‌, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల రంగానికి రాష్ట్రం ముఖ్యమైన కేంద్రమని తెలిపారు. రక్షణ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు అదానీ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకుని కేవలం 10 నెలల్లో యూఏవీల తయారీ కోసం మొదటి కార్బన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ను నెలకొల్పిందని తెలిపారు. అదానీ నెలకొల్పే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌, చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, భారతీయ ఆర్మీ ఏవియేషన్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అజయ్‌కుమార్‌ సూరి, అదానీ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ ప్రెసిడెంట్‌, సీఈవో ఆశిష్‌ రాజ్‌ వన్షి, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రమోటర్‌, డైరెక్టర్‌ జీత్‌ అదానీ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 04:13 AM