Share News

Manchiryāla- ఐటీఐల్లో కొత్త కోర్సులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:12 PM

యువతకు ఉపాధి కల్పిచడమే ధ్యేయంగా ప్రభుత్వం ఐటీఐల్లో కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలలో పారిశ్రామిక శిక్షణ పూర్తి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి.

Manchiryāla-       ఐటీఐల్లో కొత్త కోర్సులు
ఎలక్ర్టికల్‌ ల్యాబ్‌లో విద్యార్థులు

- అప్రెంటీస్‌షిప్‌, జాబ్‌ మేళా ద్వారా భవిష్యత్‌కు బాటలు

- అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపిక

- జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఐటీఐల ద్వారా నాణ్యమైన శిక్షణ

ఏసీసీ, ఫిబ్రవరి 28: యువతకు ఉపాధి కల్పిచడమే ధ్యేయంగా ప్రభుత్వం ఐటీఐల్లో కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలలో పారిశ్రామిక శిక్షణ పూర్తి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నాలుగు ప్రభుత్వ ఐటీలు మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్‌, జన్నారంలలో ఉన్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ 1969లో ఏర్పాటు చేశారు. మిగిలినవి అనంతరం ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీఐలు అన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధీనంలో పనిచేస్తాయి. జిల్లాలోని ఐటీఐలలో ఎలక్ర్టీషియన్‌, ఫిట్టర్‌ , ఎలక్ర్టానిక్‌ మెకానిక్‌, వెల్డర్‌, మోటారు మెకానిక్‌, టర్నర్‌, కంప్యూటర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఫ్యాషన్‌ టెక్నాలజీ, సోలార్‌ టెక్నిషియన్‌ కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో ట్రేడ్‌లో గరిష్టంగా వంద మంది విద్యార్థుల నుంచి కనిష్టంగా 20 మంది విద్యార్థుల వరకు శిక్షణ పొందుతున్నారు. దాదాపు అన్ని కోర్సుల్లోప్రవేశానికి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు.

- నెలకొకటి చొప్పున మేళా..

డైరెక్టర్‌ జనరల్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ట్రైనింగ్‌ ఆదేశాల ప్రకారం ప్ర తి ప్రభుత్వ ఐటీఐలో నెలకు ఒక అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహించాల్సి ఉంది. ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంచి ప్రతిస్టాత్మక మైన కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్‌ చేసేందుకు ఎంపికవుతున్నారు. ఈసీఐఎల్‌, టాటా ఏరో స్పేస్‌, సింగరేణి, రైల్వే వంటి వాటిలో అప్రెం టీస్‌షిప్‌ పూర్తి చేయడంతో పాటు కొన్ని సంస్థలు వాటిలోనే అనంతరం ఉపాధి కల్పిస్తున్నాయి.అప్రెంటీస్‌షిప్‌ సమయంలో స్టైఫండ్‌ కూడా విద్యార్థుల కు చెల్లిస్తున్నారు. జాబ్‌మేళాల ద్వారా పేరున్న ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. నోటిఫికేషన్‌ల ద్వారా పరీక్షలు రాసి ట్రాన్స్‌కో, టీఎస్‌ఎన్‌పీ డీసీఎల్‌,రైల్వే, సింగరేణి, ఈసీఐల్‌ , బార్క్‌ , సి ర్పూరు పేపరుమిల్లు వంటి వాటిలో ఉద్యోగాలు పొందుతున్నారు. 2021లో నిర్వహించిన జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్షలో మంచిర్యాల ఐటీఐలో చదివిన 10 మంది అమ్మాయిలు పరీక్షలు రాసి ఉద్యోగం సాధించారు.

- నైపుణ్యాల మెరుగుదలకు..

మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐని అడ్డాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా భవన నిర్మాణానికి ఇక రూ. 5 కోట్లు మంజూరు చేయడంతో పాటు టాటా సంస్థ ద్వారా విద్యా ర్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణను అందించను న్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో చదువుకున్న వారిలో ఉత్తీర్ణత శాతం 2022లో 96 శాతం, 2023లో 89 శాతంగా ఉంది. ప్రభు త్వ ఐటీఐలో ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యనందిస్తున్నా రు. అర్హులకు స్కాలర్‌షిప్‌లు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. మంచిర్యాల, మందమర్రిలో ఐటీఐలకు అనుబంధంగా స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ సెంట ర్లను ఏర్పాటు చేస్తున్నారు. మందమర్రిలో నిర్మాణం పూర్తయి వారం రోజుల క్రితం ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, సింగరేణి అధికారులు సెంటర్‌ను ప్రారంభించారు. మంచిర్యాలలో రూ. 8కోట్ల నిధులతో నిర్మాణ దశలో ఉంది. దీని ద్వారా కూడా యువతకు షార్ట్‌ట ర్ము కోర్సులు అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.

- భవనాలు లేక ఇబ్బంది..

మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుం ది. ఆర్‌అండ్‌బీ అధికారులు వినియోగానికి పనికిరాదని సర్టిఫై కూడా చేశారు. 2022లోనే కొత్త భవనం కోసం రూ. 13.4 కోట్లతో ఎస్టీమేషన్‌ చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. భవనంలో చాలా భాగంగా పగుళ్లు తేలి పెచ్చులూడుతుంది. సరిపడా గదులు లేక ల్యాబ్‌లు , క్లాస్‌రూంలు ఒకే చోట నిర్వహించాల్సి వస్తుంది. శ్రీరాంపూర్‌లో సింగరేణి పాఠశాల భవనంలో, జన్నారంలో ప్రభుత్వ పాఠశాల భవనంలో ఐటీఐలు నిర్వహిస్తున్నారు. మందమర్రిలో మాత్ర మే సొంత భవనం ఉంది. జిల్లాలోని ఐటీఐలలో టీచింగ్‌స్టాఫ్‌ కూడా తగినంత మంది లేరు. ఏళ్ల తరబడి నియిమకాలు లేనందున అరకొర సిబ్బందితోనే తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

- కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంది

- జ్యోతిశ్రీ, మిట్టపల్లి , ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు విద్యార్థిని

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా జీవితంలో స్ధిరపడతాననే నమ్మకం కలిగింది. ప్ర భుత్వ ఐటీఐలు నైపుణ్యతతో కూడిన శిక్షణను చక్కగా అందిస్తున్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

- ఉద్యోగావకాశాలతో పాటు స్వయం ఉపాధి..

- చందర్‌, మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌

ఐటీఐలో కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ ,ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలతో పాటు స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. రెండు సంవత్సరాల కోర్సుపూర్తి చేసిన వారు కొన్ని డిప్లొమాకోర్సుల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు అర్హులు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తిచేసినవారు టెక్నికల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ పరీక్ష రాసి షార్ట్‌ట ర్మ్‌ శిక్షణ ద్వారా డీఎస్సీ రాయడానికి అర్హత సాధించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం ఉంది.

Updated Date - Feb 28 , 2024 | 10:12 PM