Share News

ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:32 AM

: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వహించొద్దని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
డిండిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలునాయక్‌

డిండి, జనవరి 8: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వహించొద్దని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాదవరం సునీత అధ్యక్షతన సోమవారం జరిగిన మండల సర్వసభ్యంలో మాట్లాడారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ప్రజలకు అధికా రులు జవాబుదారీగా ఉండాలన్నారు. ఆరు గ్యారెంటీలు అర్హులైన పేదలకు అందించాలన్నారు. డిండి ప్రాజెక్టుకు నూతనంగా నిర్మించిన షెట్టర్లు లీకవుతుండడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు నిలిపివేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ తిరుపతయ్య, ఎంపీడీవో డానియేల్‌, పంచాయతీ ఏఈ విజయ్‌కుమార్‌, ఎంఈవో సామ్యనాయక్‌, హాస్టల్‌ అధికారి నాగరాజు, డాక్టర్‌ షాలీని, రేణుక, నాగేశ్వర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, సర్పంచ్‌ సాయమ్మకాశయ్య ఉన్నారు.

దేవరకొండ : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. మండలంలోని వైదొని వంపు గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పూజలు నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ జాన్‌యాదవ్‌, మల్లేపల్లి ఎంపీపీ రేఖాశ్రీదర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, సిరాజ్‌ఖాన్‌, సర్పంచ్‌ పాపమ్మ, దేవేందర్‌నాయక్‌, భాస్క ర్‌రెడ్డి, ఇందిరా, కొర్ర రాంసింగ్‌, కిన్నెర హరికృష్ణ, విజయ్‌, అంజయ్య, ఆంజనేయులు, లక్ష్మణ్‌, సీత్యనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:32 AM