Share News

8న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - May 25 , 2024 | 11:06 PM

వచ్చే నెల 8న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులు విధిగా హాజరుకావాలని మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి, న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ కల్యాణ్‌చక్రవర్తి అన్నారు.

8న జాతీయ లోక్‌ అదాలత్‌
కోర్టు ఆవరణలో ఇన్సూరెన్స్‌ కంపెనీ అడ్వకేట్లతో సమావేశమైన మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కల్యాణచక్రవర్తి

మహబూబ్‌నగర్‌, మే 25 : వచ్చే నెల 8న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులు విధిగా హాజరుకావాలని మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి, న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ కల్యాణ్‌చక్రవర్తి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఇన్సూరెన్స్‌ కంపెనీల మేనేజర్లు, టీఎస్‌ఆర్‌టీసీ, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులతో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. జిల్లా మోటార్‌ వెహికిల్‌ ఆక్సిడెంట్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని, వీటిని చాలావరకు పరిష్కరించేందుకు అంద రూ చొరవ తీసుకోవాలని సూచించారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌కు విధిగా హా జరయ్యేలా ప్రయత్నం చేయాలని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. లోక్‌ అదాలత్‌లో పలు రకాల కేసుల పరిష్కారం కోసం అవకాశం ఉంటుందని, ఈ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇన్సూరెన్స్‌ కంపెనీ, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, స్టాండింగ్‌ కౌన్సిల్‌, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:06 PM