Share News

పాఠశాలల బలోపేతానికి ‘నాట్కో’ కృషి

ABN , Publish Date - May 24 , 2024 | 12:02 AM

ప్ర భుత్వ విద్యాలయాలను బలోపే తం చేసేందుకు భాగంగా నాట్కో ట్రస్ట్‌ కృషి చేస్తుందని నాట్కో ట్రస్టు ప్రతినిధి జీఎల్‌ఎన రావు అన్నారు.

 పాఠశాలల బలోపేతానికి ‘నాట్కో’ కృషి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న నాట్కో ట్రస్టు సభ్యులు

పాఠశాలల బలోపేతానికి ‘నాట్కో’ కృషి

నాగార్జునసాగర్‌, మే 23: ప్ర భుత్వ విద్యాలయాలను బలోపే తం చేసేందుకు భాగంగా నాట్కో ట్రస్ట్‌ కృషి చేస్తుందని నాట్కో ట్రస్టు ప్రతినిధి జీఎల్‌ఎన రావు అన్నారు. సాగర్‌ హిల్‌కాలనీలోని ఉన్న బీసీ గురుకుల పాఠశాల వసతిగృహంలో నాట్కో ట్రస్టు ఆధ్వర్యం లో రూ.60లక్షల వ్యయంతో ప్రహరీ, మరుగుదొడ్లు, బాతరూంల నిర్మాణం చేపట్టనున్నారు. ఆ పనులకు గురువారం ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. వి ద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించవచ్చని అన్నారు. కార్యక్రమంలో నాట్కో ట్రస్టు సివిల్‌ ఇంజనీర్‌ సునీల్‌, పాఠశా ల ప్రిన్సిపాల్‌ రజనీకాంత, సిబ్బంది నవీన, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:02 AM