Share News

‘నారీ శక్తి వందన్‌’ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:03 PM

పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా చేపట్టిన నారీ శక్తి వందన్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి పిలుపునిచ్చారు.

‘నారీ శక్తి వందన్‌’ను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), ఫిబ్రవరి 6 : పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా చేపట్టిన నారీ శక్తి వందన్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళ వారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా మో ర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మావేణి అధ్యక్షతన ఏర్పా టు చేసిన మహిళా కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ఆధ్వ ర్యంలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేసిన మహిళలు కలిసికట్టుగా విజయవంతం చేయాలని కోరారు. మహిళా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకవచ్చిన సంక్షేమ పథకాలను తోటి, గ్రామీణ మహిళలకు వివరించాల్సిన అవసరం ఎంతైన ఉం దని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళాసంఘల స భ్యులకు అమలు చేస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకునేలా వివరించాలని కోరారు. మహి ళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు పా ర్లమెంట్‌లో ప్రవేశ పెట్టడం, ముస్లీం మహిళలకు త్రిపుల్‌ తలాక్‌, ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం, వీధి వ్యా పారులకు ముద్రా లోన్లు, బేటీ బచావో - బేటీ బచావో, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమా ఖ్యలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రోత్సహిం చడం లాంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకొ చ్చారని వివరించారు. గత 10 సంవత్సరాలుగా మ హిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆమె కొని యాడారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్‌ రెడ్డి, నారాయణపేట మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాహితీ రెడ్డి, నిరంజన్‌, యాదమ్మ, నిరంజనమ్మ, బాలేశ్వరమ్మ, అంజమ్మ, లలితా, ప్రసన్న, తదితరులున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:04 PM