Share News

నారాయణ ఆల్‌టైమ్‌ రికార్డు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:47 AM

ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు శరణి, సింధూరలు

నారాయణ ఆల్‌టైమ్‌ రికార్డు!

ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు శరణి, సింధూరలు ప్రకటించారు. జూనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గానూ 469 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకును సాధించినట్టు చెప్పారు. అలాగే సీనియర్‌ ఎంపీసీ విభాగంలో 993 మార్కులతో ముగ్గురు టాపర్లుగా నిలిచారని వారు వెల్లడించారు. జూనియర్‌ బైపీసీ విభాగంలో 438 మార్కులతో 6 మంది విద్యార్థులు ప్రతిభను కనపరిచారని చెప్పారు. అలాగే సీనియర్‌ బైపీసీ విభాగంలో 994 మార్కులతో స్టేట్‌ టాప్‌ ర్యాంకును సాధించినట్టు వివరించారు. ఆరంభం నుంచి ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ను పట్టిష్ఠమైన మైక్రో షెడ్యూల్‌గా రూపొందించి కాన్సెప్ట్యువల్‌ ఓరియంటేషనల్‌లో విద్యా బోధన చేయడం ద్వారానే ఇలాంటి ఫలితాలను సాధించామని చెప్పారు. తెలంగాణలోని తమ విద్యా సంస్థల్లో జూనియర్‌, సీనియర్‌ ఇంటర్‌లో అత్యధిక పాస్‌ పర్సంటేజ్‌ సాధించామని డైరెక్టర్లు తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 08:30 AM