హైవే పై ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం..
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:32 AM
చౌటుప్పల్ పట్టణంలోని 65 వ నంబరు జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
చౌటుప్పల్ టౌన, సెప్టెంబరు 2: చౌటుప్పల్ పట్టణంలోని 65 వ నంబరు జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిని జాతీయ రహదారికి ఇరు వైపుల మూడు సంవత్సరాల క్రితం హరిత హారం కింద నాటారు. హైవే పై 52 వ కి. మీటరు రాయి నుంచి 55వ కిలో మీటరు రాయి వరకు 2.45 కిలోమీటర్ల పొడవున నిర్మించే ప్లై ఓవర్ కు కేంద్ర ప్రభు త్వం రూ. 114 -00 కోట్ల ను కేటాయించింది. హైవే పై ఆర్డీవో కార్యాలయం వెళ్లే దారి నుంచి పద్మావతి ఫంక్షన హాల్ వరకు ఈ ప్లై ఓవర్ ను నిర్మించనున్నారు. ఫ్లైఓవర్‌ను నిర్మాణం చేసే సమయంలో వాహనాల రాకపోకల కోసం 2024 జూలై 20నుంచి చేపట్టిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.