Share News

నాబార్డు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:12 AM

నాబార్డు ద్వారా వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట ఎస్బీఐ రీజనల్‌ మేనేజర్‌ కె.జ్యోతి అన్నారు.

నాబార్డు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న రీజనల్‌ మేనేజర్‌ కే జ్యోతి

గరిడేపల్లి, జనవరి 6: నాబార్డు ద్వారా వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట ఎస్బీఐ రీజనల్‌ మేనేజర్‌ కె.జ్యోతి అన్నారు. శనివారం మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో రైతులు, వ్యవసాయ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నాబార్డు ద్వారా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తుందన్నారు. వివిధ రంగాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాల వివరాలను ఆమె వివరించారు. అగ్రికల్చర్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా వ్యవసాయ ఉత్పత్తి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, పాడి పరిశ్రమపై మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌, కుటీర గ్రామీణ పరిశ్రమలు, కళలు, చేతి పనుల అభివృద్ధి సాధికారత కోసం రుణాలను అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేతి పనులు ఇతర అనుబంధ వాణిజ్య రంగాల ద్వారా రైతులకు ఇస్తున్న సబ్సిడీల గురించి వివరించారు. కార్యక్రమంలో కేవీకే ఇన్‌చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డీ.నరేష్‌, నాబార్డు డీడీఎం వినయ్‌కుమార్‌, సత్యనారాయణ, కేవీకే శాస్త్రవేత్తలు సీహెచ్‌.నరే్‌ష, డీ.ఆదర్శ్‌, మాధురి, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:13 AM