Share News

కూరెళ్ల సేవలకు నా సెల్యూట్‌

ABN , Publish Date - Feb 19 , 2024 | 11:34 PM

రాష్ట్రం లోనే వెల్లంకి గ్రామానికి ప్రత్యేక స్థానం దక్కిందని, గ్రంథాలయాలకు కూరెళ్ల విఠలాచార్య చేస్తున్న సేవలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

కూరెళ్ల సేవలకు నా సెల్యూట్‌
కూరెళ్ల విఠలాచార్య గ్రంఽథాలయ నూతన భవన ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

రాజ్‌భవనే ఇక్కడికి తరలివచ్చింది

తెలంగాణలోనే వెల్లంకికి ప్రత్యేక స్థానం

భావితరాలకు పుస్తకాలు అందించడం కూరెళ్ల గొప్పతనం

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

యాదాద్రి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి)/రామన్నపేట: రాష్ట్రం లోనే వెల్లంకి గ్రామానికి ప్రత్యేక స్థానం దక్కిందని, గ్రంథాలయాలకు కూరెళ్ల విఠలాచార్య చేస్తున్న సేవలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సోమవారం సా యంత్రం మండలంలోని వెల్లంకిలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయంతో భావితరాల కు పుస్తకాలను అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈరో జు చాలా పనుల్లో ఉన్నా గ్రంథాలయాన్ని ప్రారంభించాలని వచ్చానని, మహానుభావుడు ఆచార్య కూరెళ్లని కలవడం చాలా సంతోషంగా ఉం దన్నారు. వెల్లంకి గ్రామానికి రాజ్‌భవనే వచ్చిందని, మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో వెల్లంకి గ్రామాన్ని, ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రస్తావించడంపై ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. యువత పోటీ పరీక్షలకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వెల్లంకి ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఆచార్య కూరెళ్ల ప్రతి ఒక్కరికీ రోల్‌ మోడల్‌గా నిలిచారన్నారు. గ్రంథాలయాలకు కూరెళ్ల విఠలాచార్య చేస్తున్న సేవల పట్ల, రాబోయే తరాలకు పుస్తకాలు అందించటంపై వారికి సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. గవర్నర్‌ రావడంపై కూరెళ్ల విఠాలాచార్య కవితతో కీర్తించారు. కార్యక్రమానికి సహకరించిన జస్టిస్‌ లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అనంతరం గవర్నర్‌ను కూరెళ్ల కుటుంబసభ్యులు సన్మానించారు. కూరెళ్ల గ్రంథాలయానికి రూ.10,63,470 మంజూరు చేసిన రాష్ట్ర గవర్నర్‌ కూరెళ్ల విఠలాచార్యకు చెక్కు అందజేశారు. సాయంత్రం 6.55కు వెల్లంకి గ్రామానికి రోడ్డు మార్గంలో వచ్చిన గవర్నర్‌ రాత్రి 7.30కు రాజ్‌భవన్‌కు బయలుదేరారు.

అందరికీ జ్ఞానం పంచాలన్నదే విఠలాచార్య అభిమతంర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. లక్ష్మణ్‌

జ్ఞానాన్ని అందరికీ పంచాలనేదే ఆచార్య డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య అభిమతమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కూనూరు లక్ష్మణ్‌ అన్నారు. ఆచార్య కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయంలోని సాయి సభా మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లక్ష్మ ణ్‌ మాట్లాడుతూ ఒక పని చేయాలంటే ఎంత కష్ట మో అందరికీ తెలుసని, అలాంటిది గ్రంథాలయాన్ని ప్రారంభించే బృహత్కర్యాన్ని విఠలాచార్య ప్రా రంభించి సఫలీకృతులయ్యారన్నారు. కర్త, కర్మ క్రియ అంతా ఆయనేనని కొనియాడా రు. గ్రంథాలయాల ఏర్పాటు సమాజానికి కావాలని, 60ఏళ్ల క్రితం పుస్తక ప్రాముఖ్యా న్ని గమనించి గ్రంథాలయాలను ప్రారంభించాలని అనుకున్నారని తెలిపారు. వట్టికోట ఆల్వార్‌స్వామి, స్వామి రామానంద తీర్థ వంటి ప్రముఖులు గ్రంథాలయోద్ధరణకు కృషి చేశారని, వారి బాటలోనే విఠలాచార్య 1984లో వెల్లంకిలో గ్రంథాలయాన్ని ప్రారంభించారని, ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం అందరికీ గర్వకారణమన్నారు.

ఎక్కడకెళ్లినా పల్లెలకు రావాలి: కూరెళ్ల విఠలాచార్య

ఎక్కడికి వెళ్లినా రెండు, మూడు ఏళ్లకై నా ఒకసారి అందరం పల్లెకు రావాలని, పల్లెలో పుట్టినందుకు ఎంతోకొంత పల్లెటూర్లకు సేవ చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య అన్నా రు. తనకు వచ్చిన అవార్డులు పల్లెటూరికే అం కితమని, తన ఆస్తి గ్రంథాలయమేనని అన్నారు. తనకు మంచి శిష్యులు ఉన్నారని, గ్రంథాలయంలోని పుస్తకాలను సాహితీ మిత్రులు ఇచ్చారన్నారు. ఇదంతా ఒక్కరితోకాదని, అందరూ కలిస్తేనే నెరవేరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన రూ.25లక్షలకు మరో రూ.25లక్షలు కలిపి గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చిస్తానని అన్నారు. సినీ గేయ రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ తాను పుట్టిన చల్లగరిగ గ్రామంలో గ్రంథాలయం నిర్మిస్తున్నానని, తన సినీ జీవితంలోని సాహితీ ప్రక్రియకు గ్రంథాలయమే కారణమన్నారు. తన పాటకు మూ లం తన ఊరి గ్రంథాలయమే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, రచయితలు, కవులు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, కలెక్టర్‌ హనుమంతు కే. జెండగె, అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, గ్రంఽథా లయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, నర్మద, తపతి, సరస్వ తి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, కవులు, రచయితలు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2024 | 11:34 PM