Share News

అప్పులు ఎగ్గొట్టేందుకు హత్య

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:58 PM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మ హిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

 అప్పులు ఎగ్గొట్టేందుకు హత్య
హత్య కేసు మిస్టరీ వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ శివరాంరెడ్డి

అప్పులు ఎగ్గొట్టేందుకు హత్య

ఔరవాణి మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ

ముగ్గురు నిందితుల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

నల్లగొండ టౌన, మార్చి 28: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మ హిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాన్ని నెరపడంతో పాటు ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని అడగటమే ఆమె హత్యకు కారణ మైంది. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వివరించారు. నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ ముప్పిడి పిచ్చమ్మ(63) భర్త కొంతకాలం కిందట మృతి చెందాడు. ఈ దంపతులకు పిల్లలు కూడా లేకపోవటంతో ఇంటి వద్దనే ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సిలివేరు లక్ష్మయ్యతో ఏర్పడిన పరిచయం వి వాహేతర సంబంధానికి దారితీసింది. పిచ్చమ్మ తన దగ్గర ఉన్న డబ్బుల్లో రూ. 1.50లక్షలు లక్ష్మయ్యకు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బులు ఇవ్వాలని తరచూ లక్ష్మయ్య ను అడుగుతుండటంతో వాయిదా వేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నకిరేకం టి చంద్రయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పిచ్చమ్మ అతడికి కూడా రూ. 1లక్ష అప్పుగా ఇచ్చింది. అదే గ్రామానికి చెందిన నారబోయిన అంజయ్యకు కూడా రూ.40వేలు అప్పుగా ఇచ్చింది. అప్పు తీర్చాలని పదేపదే అడుగుతోందని లక్ష్మయ్య, చంద్రయ్య, తాను అప్పుతీర్చినా రూ.40వేలు మళ్లీ కట్టించుకుందని అంజయ్యలు పిచ్చమ్మపై ఆగ్రహం పెంచుకున్నారు.

పథకం ప్రకారం హత్య...

వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే ఈ ముగ్గురు ఒక సందర్భంలో కలిసినప్పుడు పిచ్చమ్మ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆమెను అంతమొందించి త మ అప్పు ఎగ్గొట్టవచ్చని సిలివేరు లక్ష్మయ్య, నకిరేకంటి చంద్రయ్య భావించగా, త న ప్రతీకారం తీరుతుందని నారబోయిన అంజయ్య అంగీకరించాడు. లక్ష్మయ్య సూ చన మేరకు ఈ నెల 21వ తేదీ రాత్రి పిచ్చమ్మ గ్రామ శివారులోని నకిరేకంటి అ చ్చయ్య బావి వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న లక్ష్మయ్య, చంద్రయ్య, అంజయ్యలు ఆమెపై కర్రలతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 2.8 గ్రాముల బంగారు పుస్తెలతాడు తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఉన్న పాడుపడిన బావిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మిస్సింగ్‌ కేసుగా నమోదు

పిచ్చమ్మ ఇంటికి తిరిగిరాక పోవడంతో గ్రామస్థుల సమాచారం మేరకు మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన ఆమె సోదరుడు పందుల యా దయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నార్కట్‌పల్లి పోలీసులు మిస్సిం గ్‌ కేసు నమోదు చేశారు. ఈ నెల 24న ఔరవాణి గ్రామ శివారులోని పాడుబడిన బావి నుంచి దుర్వాసన వస్తున్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో వెలికితీయించి పిచ్చమ్మదిగా గుర్తించారు. మృతురాలి బంధువుల స మాచారం మేరకు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ ఘటనలో పాల్గొన్న అంజయ్య, చంద్రయ్యలను కూడా అదుపులోకి తీసుకుని వారినుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రి మాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రతిభ చూపిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ అంతిరెడ్డిలను అభినందించారు.

Updated Date - Mar 28 , 2024 | 11:58 PM