బాధ్యతలు చేపట్టిన మునిసిపల్ కమిషనర్
ABN , Publish Date - Feb 14 , 2024 | 11:27 PM
మహబూబ్‌నగర్ మునిసిపల్ కమిషనర్‌గా డి మహేశ్వర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు.
- అభినందనలు తెలిపిన చైర్మన్, కౌన్సిలర్లు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14 : మహబూబ్‌నగర్ మునిసిపల్ కమిషనర్‌గా డి మహేశ్వర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, వైస్‌చైర్మన్ షబ్బీర్‌అహ్మద్‌తో పాటు కౌన్సిలర్లు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మునిసిపల్ అధికారులు, సిబ్బంది కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పాలమూరు మునిసిపల్ అభివృద్ధికి కృషిచేయాలని చైర్మన్ కోరారు. పట్టణ అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
కొత్తగంజిలో రోడ్డును పరిశీలించిన మునిసిపల్ చైర్మన్
పాల మూరు మునిసిపాలి టీ పరిధిలోని కొత్తగం జి ఫ్లైఓవర్ కింద రహదారి దెబ్బతిన డంతో కాలనీవా సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం మునిసిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్‌గౌడ్ దెబ్బతిన్న రహదారిని అధికారులతో కలిసి పర్యటించారు. ఈ రోడ్డుపై నిత్యం భారీ వాహనాలు వెళుతుండటంతో డ్రైనేజీ పక్కన రహదారి కుంగిపోవడం వల్ల గమనించని వాహనదారులు డ్రైనేజీలో పడిపోయి ప్రమా దాలకు గురవుతున్నారని స్థానికులు చైర్మన్ దృష్ఠికి తీసుకుపోగా వెంటనే రహదారికి మర మ్మతులు చేయించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో డీఈ బెంజిమెన్, ఏఈ వైష్ణవి, నాయకులు జాజిమొగ్గ నర్సింహు లు, ఖాజాపాషా, అంజద్, పాపారాయుడు, చిన్న పాల్గొన్నారు.