Share News

ఎంపీ రంజిత్‌ రెడ్డి ఫోన్‌లో బెదిరించారు

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:52 AM

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తనను ఫోన్‌లో బెదిరించడంతోపాటు దూషించారని బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శనివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంపీ రంజిత్‌ రెడ్డి ఫోన్‌లో బెదిరించారు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

బంజారాహిల్స్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తనను ఫోన్‌లో బెదిరించడంతోపాటు దూషించారని బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శనివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేసి ‘సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ..’ బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 09:47 AM