Share News

బీటీ.రణదీవె స్ఫూర్తితో ఉద్యమాలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:19 AM

అఖిలభారత కార్మికోద్యమనేత బీటీ.రణదీవె స్ఫూర్తితో కార్మికులు తమహక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు.

బీటీ.రణదీవె స్ఫూర్తితో ఉద్యమాలు
రణదీవె చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

రామన్నపేట, ఏప్రిల్‌ 6: అఖిలభారత కార్మికోద్యమనేత బీటీ.రణదీవె స్ఫూర్తితో కార్మికులు తమహక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. భారత కార్మిక ఉద్యమ నేత బిటి రణదీవ 34వ వర్థంతి సందర్భంగా రామన్నపేటలో సీఐటీయు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ బీటీ.రణదీవె దేశ వామపక్ష ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన కార్మికోద్యమ సారఽథి అని కొనియాడారు. సీఐటీయూ వ్యవస్థాపక సభ్యులుగా ఉండే అనేక కార్మిక పోరాటాలకు సారధ్యం వహించారన్నారు. బీటీ రణదీవె స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ గొరిగె సోములు, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు వంగాల మారయ్య, నకిరేకంటి రాము, తరిగొప్పుల వెంకట్‌రెడ్డి, పిట్టల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:19 AM