మూసీ సుందరీకరణకు రూ. 1,50,000 కోట్ల వ్యయమా..?
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:33 AM
బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో సు మారు రూ. 97 వేల కోట్ల నిధులను వెచ్చించి రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 30 కిలో మీటర్ల పరిధిలో ఉండే ముత్యమంతా మూసి నది సుందరీకరణకు రూ. 1,50,000 కోట్లు వ్యయం చేస్తామని అంటుండడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు.
- మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్
జగిత్యాల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో సు మారు రూ. 97 వేల కోట్ల నిధులను వెచ్చించి రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 30 కిలో మీటర్ల పరిధిలో ఉండే ముత్యమంతా మూసి నది సుందరీకరణకు రూ. 1,50,000 కోట్లు వ్యయం చేస్తామని అంటుండడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీపాద ప్రాజెక్టు, కొండ పోచమ్మ, అన్న పూర్ణ, రంగనాయక సాగర్, మిడ్ మానేర్ తదితర ప్రాజెక్టులు, వందల కిలో మీటర్ల కాలువలు నిర్మాణం, నీటి ఎత్తిపోతలను నిర్మించామన్నారు. వాటికి వెచ్చించిన వాటికంటే మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ వెచ్చిస్తున్న నిధులు అధికంగా ఉండడం ప్రజలు గమనించాలన్నారు. దేశంలో తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గులాబీ అధినేత కేసీఆర్ గట్టి పునాదులు వేశారన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరకపోయిందని, నష్టాల్లో ఉందని కాంగ్రెస్ పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీల ను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని విమర్శిం చారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతుందన్నారు. కాంగ్రెస్ వైపల్యాలను ప్రజల ముందు ఉం చుతామన్నారు. వచ్చే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.